Virat Kohli: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. మరేం పర్లేదు.. కోచ్‌ అంటే ఇలా ఉండాలి! వైరల్‌

9 May, 2022 13:26 IST|Sakshi
ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్‌-2022 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం(మే 8) జరిగిన మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రైజర్స్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ వేసిన మొదటి బంతికే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. దీంతో 0-1 స్కోరుతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభమైంది.

కాగా తాను అవుట్‌ కాగానే కోహ్లి తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. విసుగు, కోపం కలగలిసిన చిరునవ్వుతో క్రీజును వీడాడు. కోహ్లి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడిని ఓదార్చాడు. తల నిమురుతూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరట కలిగించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కోచ్‌ అంటే ఇలా ఉండాలి.. సంజయ్‌ సర్‌ మీరు కోహ్లి పట్ల వ్యవహరించిన తీరుకు హ్యాట్సాఫ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌ అజేయ అర్ధ శతకాని(73- నాటౌట్‌)కి తోడు రజత్‌ పాటిదార్‌(48), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(33).. దినేశ్‌ కార్తిక్‌(8 బంతుల్లో 30) రాణించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఆర్సీబీ బౌలర్‌ వనిందు హసరంగ చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి రైజర్స్‌ పతనాన్ని శాసించాడు

దీంతో 67 పరుగుల తేడాతో విజయం ఆర్సీబీ సొంతమైంది. ఇదిలా ఉంటే.. కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం ఈ సీజన్‌లో ఇది మూడోసారి. మొత్తంగా ఆరోసారి కావడం గమనార్హం.  

ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్లు
ఆర్సీబీ-192/3 (20)
ఎస్‌ఆర్‌హెచ్‌- (19.2)

చదవండి👉🏾IPL 2022 - MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని

మరిన్ని వార్తలు