Mayank Agarwal: 'బాబుపై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా ఉంది.. తొలగిస్తే ఆడతాడేమో!'

8 Apr, 2022 20:30 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన మయాంక్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. హార్ధిక్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన మయాంక్‌ మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అక్కడే ఉన్న రషీద్‌ ఖాన్‌ సులువుగా క్యాచ్‌ అందుకున్నాడు.

దీంతో మయాంక్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు తాజా దానితో కలిపి పంజాబ్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మయాంక్‌ వరుసగా 32, 1, 4, 5 పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్సీ ప్రభావం అతన్ని దెబ్బతీస్తుందా అని పలువురు ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా స్పందించాడు.

''మయాంక్‌పై కెప్టెన్సీ ప్రభావం గట్టిగా పడింది. ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. నాలుగు మ్యాచ్‌లు కలిపి 42 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా వస్తున్న మయాంక్‌కు ఇది సరిపోదు. గత సీజన్‌లో కనిపించిన మయాంక్‌ ఇప్పుడు కనబడడం లేదు. ఇలాగే ఉంటే అతను ఆటను మరిచిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించండి.. అప్పుడైనా ఆడతాడేమో'' అంటూ పేర్కొన్నాడు. కాగా గత సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండడంతో మయాంక్‌ యథేచ్చగా బ్యాట్‌ ఝులిపించాడు. ఈసారి ధావన్‌కు కెప్టెన్సీ ఇస్తారనుకుంటే పంజాబ్‌ కింగ్స్‌ ప్రాంచైజీ మాత్రం మయాంక్‌పై నమ్మకంతో అతనికే పగ్గాలు అప్పజెప్పింది. 

చదవండి: IPL 2022: 'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!'

మయాంక్‌ అగర్వాల్‌ ఔట్‌ వీడియో కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు