-

IPL 2022 Auction: 39 బంతుల్లో 79.. పంజాబ్‌ కింగ్స్‌ వదులుకొని తప్పుచేసింది

21 Dec, 2021 18:16 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా తమిళనాడు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలి 151 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఎన్‌ జగదీషన్‌ (102 పరుగులు) సెంచరీ సాధించగా.. చివర్లో షారుక్‌ ఖాన్‌ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.39 బంతుల్లోనే 79 పరుగులు చేసిన షారుక్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

చదవండి: LPL 2021: ఆమిర్‌.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా!

తాజాగా షారుక్‌ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తన్నాయి. అయితే పంజాబ్‌ కింగ్స్‌ మాత్రం తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే ఇటీవలే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ రిటైన్‌ జాబితాలో షారుక్‌ ఖాన్‌కు అవకాశం లభించలేదు. కానీ షారుక్‌ ఖాన్‌ మాత్రం విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస అర్థశతకాలతో తన విలువేంటో చూపించాడు. షారుక్‌ ఖాన్‌ లాంటి యంగ్ టాలెంటెడ్‌ ప్లేయర్‌ను వదులుకొని పంజాబ్‌ కింగ్స్‌ తప్పుచేసిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. ఇక  ఫిబ్రవరిలో జరగనున్న మెగా వేలంలో షారుక్‌ ఖాన్‌ను దక్కించుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. 

చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు

మరిన్ని వార్తలు