IPL 2022: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన ధవన్‌

25 Apr, 2022 17:17 IST|Sakshi
Photo Courtesy: IPL

Shikhar Dhawan Eyes On Few IPL Records: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండాఫ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 25) జరుగనున్న కీలక సమరానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌ కీ ప్లేయర్‌ శిఖర్‌ ధవన్‌ను మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడిన గబ్బర్‌ నేటి మ్యాచ్‌తో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. ధవన్‌కు ముందు ధోని (227), దినేష్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (220), విరాట్‌ కోహ్లి (215), రవీంద్ర జడేజా (207), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (200) మాత్రమే ఈ ఘనతను సాధించారు.

199 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 34.67సగటున 5998 పరుగులు చేసిన ధవన్‌..
 

  • నేటి మ్యాచ్‌లో మరో 2 పరుగులు చేస్తే 6000 పరుగుల క్లబ్‌లో చేరిన రెండో ఐపీఎల్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ధవన్‌కు ముందు కోహ్లి (6402) మాత్రమే 6000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. 
  • సీఎస్‌కేతో ఇప్పటివరకు 27మ్యాచ్‌లు ఆడిన ధవన్ సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీల సాయంతో 941పరుగులు చేశాడు. ఇవాల్టి మ్యాచ్‌లో అతను మరో 9 పరుగులు చేస్తే సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డును (28 మ్యాచ్‌ల్లో 949 పరుగులు) అధిగమిస్తాడు. 
  • ఈ మ్యాచ్‌లో ధవన్‌ మరో 59 పరుగులు సాధించగలిగితే ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై 1000పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ధవన్‌కు ముందు రోహిత్‌ శర్మ ( కేకేఆర్‌పై 1018 పరుగులు), డేవిడ్‌ వార్నర్‌ (పంజాబ్‌పై 1005 పరుగులు) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. 
  • ధవన్‌ నేటి మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో 9000 పరుగుల మార్కును అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కనున్నాడు. టీ20ల్లో ధవన్‌కు ముందు కోహ్లి (10392 పరుగులు), రోహిత్ శర్మ (10009 పరుగులు) 9000 పరుగుల మార్కును అధిగమించారు. ధవన్‌ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు ఆడి 8989 పరుగులు చేశాడు.  
    చదవండి: కింగ్స్‌ ఫైట్‌లో గెలుపెవరిది..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

మరిన్ని వార్తలు