Shreyas Iyer: కెప్టెన్‌గా తొలి అర్థసెంచరీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు

10 Apr, 2022 20:20 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో శ్రేయాస్‌ అయ్యర్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌ ఈ మార్క్‌ను అందుకున్నాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిసిన అయ్యర్‌ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అయ్యర్‌కు కేకేఆర్‌ కెప్టెన్‌గా ఈ సీజన్‌లో తొలి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. కాగా కెప్టెన్‌గా హాఫ్‌ సెంచరీ అందుకున్న అయ్యర్‌ జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు.


Courtesy: IPL Twitter

216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 171 పరుగులకే ఆలౌట్‌ అయి 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒక దశలో నితీష్‌ రాణా(30) సహకరించడం.. అయ్యర్‌ బాగా ఆడుతుండడంతో కేకేఆర్‌ లక్ష్యం దిశగా సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ దెబ్బ తీశాడు. మొదట అయ్యర్‌ రూపంలో తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్న కుల్దీప్‌ ఆ తర్వాత మరో మూడు వికెట్లు తీసి.. ఓవరాల్‌గా 4-35-0-4తో కేకేఆర్‌ పతనాన్ని శాసించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పృథ్వీ షా 51, వార్నర్‌ 61 పరుగులు చేయగా.. ఆఖర్లో అక్షర్‌ పటేల్ 22*, శార్దూల్‌ ఠాకూర్‌ 29* రాణించారు.

శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ కోసం క్లిక్‌ చేయండి

చదవండి: Ajinkya Rahane: మూడుసార్లు తప్పించుకున్నాడు.. ఏం ప్రయోజనం!

IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు

మరిన్ని వార్తలు