Virat Kohli: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. రైజర్స్‌ చేతిలో రెండోసారి.. మొత్తంగా ఆరో‘సారీ’!

8 May, 2022 16:28 IST|Sakshi
విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డక్‌(PC: IPL/BCCI)

కోహ్లి గోల్డెన్‌ డక్‌పై విమర్శలు

IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్‌ మొదటి బంతికే అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌ ఖాతా తెరవకుండానే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఫ్యాన్స్‌ ఉసూరుమంటున్నారు.

‘‘ఏంటిది కోహ్లి.. గాడిలో పడుతున్నావు అనుకుంటే! మళ్లీనా.. మా గుండె పగిలింది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది కోహ్లి ఆట తీరును విమర్శిస్తూ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘నిలకడగా ఆడాలని కోరుకుంటే గోల్డెన్‌ డక్‌లలో నిలకడ చూపిస్తావా? నువ్వు మారవా!’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా కోహ్లి ఈ విధంగా అవుట్‌ కావడం ఐపీఎల్‌ చరిత్రలో ఆరోసారి. ఈ సీజన్‌లో ఇది మూడోసారి.

అదే విధంగా సన్‌రైజర్స్‌ బౌలర్ల చేతిలో రెండోసారి. తొలుత మార్కో జాన్‌సెన్‌.. తర్వాత జగదీశ సుచిత చేతిలో కోహ్లికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఈ సీజన్‌లో కోహ్లి ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 216. అత్యధిక స్కోరు 58.

ఐపీఎల్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన సందర్భాలు:
2008- ఆశిష్‌ నెహ్రా(ముంబై ఇండియన్స్‌) బౌలింగ్‌లో
2014- సందీప్‌ శర్మ(పంజాబ్‌ కింగ్స్‌) బౌలింగ్‌లో
2017- నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌) బౌలింగ్‌లో
2022- దుష్మంత చమీర(లక్నో సూపర్‌ జెయింట్స్‌) బౌలింగ్‌లో
2022- మార్కో జాన్‌సెన్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) బౌలింగ్‌లో
2022- జగదీశ సుచిత్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) బౌలింగ్‌లో

చదవండి👉🏾Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు?

మరిన్ని వార్తలు