పవర్‌ ప్లేను కూడా వదలని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంకెన్ని చూడాలో!

30 Mar, 2022 17:13 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మంచి రికార్డుల కంటే చెత్త రికార్డులనే ఎక్కువగా నమోదు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు పోటాపోటీగా నో బాల్స్‌ వేయడం.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బౌండరీలు, సిక్సర్ల రూపంలో ధారాళంగా పరుగులిచ్చుకుంది. అలా 211 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి పవర్‌ ప్లేలో వరుస షాక్‌లు తగిలాయి. 6 ఓవర్లు ముగిసేలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ చరిత్రలోనే పవర్‌ ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 14 పరుగులు మాత్రమే చేసింది. పవర్‌ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేయడంతో పాటు ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. అంతకముందు 2009లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ తొలి పవర్‌ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2011, 2015, 2019లో సీఎస్‌కే పవర్‌ ప్లేలో వరుసగా 15/2(కేకేఆర్‌పై), 16/1(ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 16/1(ఆర్‌సీబీపై) స్కోర్లు చేసింది. 

అయితే ఈ చెత్త రికార్డులు సీఎస్‌కే ఖాతాలో మూడు ఉన్నప్పటికి.. పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌  ఎస్‌ఆర్‌హెచ్‌ను మరోసారి ట్రోల్‌ చేశారు. ''ఎస్‌ఆర్‌హెచ్‌.. మరీ ఇంత దారుణమా''.. ''ఏ జట్టైనా మంచి రికార్డుల కోసం పోటీపడుతుంది.. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం చెత్త రికార్డుల్లో ముందుంటుంది. తాజాగా పవర్‌ ప్లేను కూడా వదల్లేదు.. ఇంకెన్నీ చూడాలో''.. ''ప్రతీ ఐపీఎల్‌లోనూ ఏదో ఒక చెత్త జట్టును చూస్తాం.. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం వరుసగా రెండో ఏడాది అదే రీతిలో కనిపిస్తుంది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్‌

Bhuvaneshwar Kumar: చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్‌ అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు