-

RR Vs CSK: హెట్‌మెయిర్‌ భార్యను ప్రస్తావిస్తూ గావస్కర్‌ కామెంట్‌.. ‘మీకసలు బుద్ధుందా’ అంటూ..

21 May, 2022 12:32 IST|Sakshi

టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్‌ అవుతున్నారు. వయసుకు తగ్గట్లుగా హుందాగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌ హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ సతీమణిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు గావస్కర్‌పై విమర్శలకు కారణమయ్యాయి.

అసలేం జరిగిందంటే... ఐపీఎల్‌-2022లో ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ శుక్రవారం(మే 20) చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు, పాపాయిని చూసేందుకు స్వదేశం వెళ్లిన విండీస్‌ హిట్టర్‌ హెట్‌మెయిర్‌ ఈ మ్యాచ్‌ కోసం తిరిగి రాజస్తాన్‌ జట్టుతో చేరాడు. 

ఇక 151 పరుగుల లక్ష్య ఛేదనతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌కు దిగగా అతడు ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో సునిల్‌ గావస్కర్‌ హెట్‌మెయిర్‌ను ఉద్దేశించి.. ‘‘హెట్‌మెయిర్‌ భార్య ప్రసవించింది.. మరి హెట్‌మెయిర్‌ రాయల్స్‌కు ఇప్పుడు డెలివరీ చేయగలడా?’’ అంటూ కామెంట్‌ చేశాడు.

ఈ వ్యాఖ్యలను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు గావస్కర్‌ తీరును తప్పుబడుతున్నారు. చమత్కారంగా మాట్లాడాలి కానీ.. ఇలా స్థాయి దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదని, కాస్త హుందాగా ప్రవర్తించాలని సూచిస్తున్నారు. ఈ వయసులో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి బుద్ధిలేని వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచి పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌ పోరులో ప్రవేశించింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌: 68- రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ స్కోర్లు
చెన్నై- 150/6 (20)
రాజస్తాన్‌- 151/5 (19.4)
5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌(23 బంతుల్లో 40 పరుగులు- నాటౌట్‌, ఒక వికెట్‌ పడగొట్టాడు)
హెట్‌మెయిర్‌ చేసిన స్కోరు: 7 బంతుల్లో 6 పరుగులు

చదవండి👉🏾IPL 2022- CSK: ఒక్క ఆటగాడు గాయపడితే.. ఇంత చెత్తగా ఆడతారా? ఆఖరి మ్యాచ్‌లోనూ..
చదవండి👉🏾Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్‌, చహల్‌కు చోటు! బ్యాకప్‌ ప్లేయర్‌గా త్రిపాఠి

Poll
Loading...
మరిన్ని వార్తలు