IPL 2022- SRH: కొత్త సీజన్‌.. కొత్త ఆటగాళ్లు.. ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్‌ యువ ఆటగాడు

14 Mar, 2022 12:48 IST|Sakshi
ఈసారి ట్రోఫీ గెలుస్తాం: సన్‌రైజర్స్‌ యువ ఆటగాడు(PC: SRH Twitter)

IPL 2022: Sunrisers Hyderabad: ఐపీఎల్‌-2022 కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నటరాజన్‌, విష్ణు వినోద్‌, సౌరభ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, ప్రియమ్‌ గార్గ్‌ తదితర ఆటగాళ్లు జట్టుతో చేరారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో అనుబంధం గురించి క్రికెటర్లు మాట్లాడిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది ఫ్రాంఛైజీ. ఈ సందర్భంగా 21 ఏళ్ల ప్రియమ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. జట్టులోకి తిరిగిరావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

‘‘గతంలో రెండేళ్లపాటు ఈ జట్టులో ఉన్నాను. మళ్లీ ఇప్పుడు ఇలా! కొత్త సీజన్‌.. కొత్త ఆటగాళ్లంతా ఒక్కచోట చేరారు. ఈసారి మేము ట్రోఫీ గెలుస్తామనే భావిస్తున్నా’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌కు మద్దతుగా నిలిచిన అభిమానులు ఇక ముందు కూడా ఇలాగే సపోర్టు చేయాలని విజ్ఞప్తి చేశాడు. మీ అండ మాకెంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

కాగా 2020లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్‌ ప్రియమ్‌ గార్గ్‌ సన్‌రైజర్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రియమ్‌ను 20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్‌లో భాగంగా మార్చి 29న రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌తో హైదరాబాద్‌ తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇక గత సీజన్‌లో హైదరాబాద్‌ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌-2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇదే:
కేన్‌ విలియమ్సన్‌(14 కోట్లు- కెప్టెన్‌), అబ్దుల్ సమద్(4 కోట్లు) ,ఉమ్రాన్ మాలిక్‌(4 కోట్లు), నికోలస్‌ పూరన్‌(10.75 కోట్లు), వాషింగ్టన్‌ సుందర్‌(8.75 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి(8.5 కోట్లు), రొమారియో షెపర్డ్‌(7.7 కోట్లు), అభిషేక్‌ శర్మ(6.5 కోట్లు), భువనేశ్వర్‌ కుమార్‌(4.2 కోట్లు), మార్కో జన్సెన్‌(4.2 కోట్లు), టి నటరాజన్‌(4 కోట్లు), కార్తీక్‌ త్యాగి(4 కోట్లు), ఎయిడెన్‌ మార్క్రమ్‌(2.6 కోట్లు), సీన్‌ అబాట్‌(2.4 కోట్లు), గ్లెన్‌ ఫిలిప్‌(1.5 కోట్లు), శ్రేయస్‌ గోపాల్‌(75 లక్షలు), విష్ణు వినోద్‌(50 లక్షలు), ఫజల్‌ హక్‌ ఫారుఖి(50 లక్షలు), జె సుచిత్‌(20 లక్షలు), ప్రియమ్‌ గార్గ్‌(20 లక్షలు), ఆర్‌ సమర్థ్‌(20 లక్షలు), శశాంక్‌ సింగ్‌(20 లక్షలు), సౌరభ్‌ దూబే(20 లక్షలు).

చదవండి: Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్‌ దేవ్‌

మరిన్ని వార్తలు