MS Dhoni Not Finished: ఫినిషర్‌ పని అయిపోలేదు.. ఇంకా మున్ముందు..

22 Apr, 2022 09:34 IST|Sakshi

IPL 2022 CSK Vs MI: ఎంఎస్‌ ధోని.. క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్‌. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా షాట్లు బాది తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించడంలో తనకు తానే సాటి. ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు ధోని భాయ్‌. చివరి ఓవర్‌.. చెన్నై గెలవాలంటే 4 బంతుల్లో 16 పరుగులు కావాలి.

క్రీజులో ధోని ఉన్నాడు.. ముంబై బౌలర్‌ ఉనాద్కట్‌ వేసిన మూడో బంతిని లాంగాఫ్‌లో సిక్సర్‌గా మలిచాడు. 4వ బంతికి ఫోర్‌. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. ఐదో బంతికి 2 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 4 పరుగులు కావాలి. అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ! ముఖ్యంగా ఈ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టాలన్న రోహిత్‌ సేనలో టెన్షన్‌.. టెన్షన్‌! మరి ధోని ఏం చేశాడు! ఏముంది.. తనదైన స్టైల్లో బౌండరీ బాది చెన్నైని గెలిపించి.. ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. అదీ మరి ధోని అంటే!

ఈ క్రమంలో ధోనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్‌..  దండాలయ్యా.. మాస్‌ దేవుడు.. మా తలైవా! ఫినిషర్‌ పని అయిపోయింది అన్నవాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. నీలో ఆట ఇంకా మిగిలే ఉందయ్యా’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

అదే విధంగా కేజీయఫ్‌-2 సినిమాలోని ‘వయొలెన్స్‌’ డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘‘ఫినిషింగ్‌.. ఫినిషింగ్‌.. ఫినిషింగ్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఫినిషింగ్‌.. ఐ అవాయిడ్‌. బట్‌ ఫినిషింగ్‌ లైక్స్‌ మీ. ఐ కాంట్‌ అవాయిడ్‌’’ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నాడు. ధోని అద్బుత ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోని మొత్తంగా 13 బంతులు ఎదుర్కొని  3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ స్కోర్లు:
ముంబై- 155/7 (20)
చెన్నై- 156/7 (20) 
మూడు వికెట్ల తేడాతో చెన్నై విజయం

చదవండి: Rohit Sharma: ఆఖరి వరకు పోరాడాం.. కానీ ధోని మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు!

మరిన్ని వార్తలు