IPL 2022: ఉమ్రాన్‌ మాలిక్‌కు బంపరాఫర్‌ తగిలే అవకాశం

19 Apr, 2022 19:40 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌‌‌‌లో సంచలనాలు సృష్టిస్తున్న సన్​రైజర్స్​ హైదరాబాద్‌‌‌‌ పేసర్‌‌‌‌ ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌... త్వరలోనే బంపర్‌ ఆఫర్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. గత టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో నెట్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా పని చేసిన ఉమ్రాన్​ ఐపీఎల్‌‌‌‌లో 152 కి.మీ. వేగంతో నిలకడగా బంతులు వేయడంతో పాటు వికెట్లు తీస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. 

ముఖ్యంగా ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ మెయిడెన్‌తో వేయడమే గాక రనౌట్‌ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ (4-1-28-4) తన కెరీర్‌లో బెస్ట్‌ గణాంకాలు నమోదు చేశాడు.

 దీంతో ఉమ్రాన్‌ మాలిక్‌ను జూన్‌‌‌‌లో సౌతాఫ్రికా, ఐర్లాండ్‌‌‌‌తో జరిగే ఏడు టీ20లకు అతన్ని టీమ్‌‌‌‌లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై సఫారీలతో పాటు ఐర్లాండ్​ టూర్​లో ద్వితీయశ్రేణి జట్టును ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ కోసం కూడా ఓ పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ పూల్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నారు. ఉమ్రాన్‌‌‌‌, నటరాజన్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలలు ఇదే ఫామ్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఉంటే ఉమ్రాన్‌‌‌‌.. టీమిండియా గడప తొక్కడం అసాధ్యమేమీ కాకపోవచ్చు. 

చదవండి: David Warner: నాన్న ఔటయ్యాడని ఏడ్చేసింది.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు