Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్‌ చెప్పగానే ఔటయ్యాడు'

10 May, 2022 08:33 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయంలో విజయం సాధించిన కేకేఆర్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌ లైనఫ్‌ విఫలంతో కేకేఆర్‌ వరుస పరాజయాలు నమోదు చేసింది. అయితే ఈసారి మాత్రం కేకేఆర్‌కు మంచి ఆరంభం లభించింది. గత సీజన్‌లో దుమ్మురేపిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఈసారి దారుణంగా నిరాశపరిచాడు.

కాగా తొలిసారి అతను తన ప్రదర్శనతో మెరిశాడు. 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అజింక్య రహానేతో(24 బంతుల్లో 25; 3 ఫోర్లు) కలిసి తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 60 పరుగులు జోడించి శుభారంభం అందించాడు. రహానే ఔటైనప్పటికి నితీష్‌ రానాతో కలిసి మంచి ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. మురుగన్‌ అశ్విన్‌, డేనియల్‌ సామ్స్‌, రిలే మెరిడిత్‌ ఇలా ఎవరు బౌలింగ్‌కు వచ్చినా అ‍య్యర్‌ ఉతికి ఆరేస్తున్నాడు.

ఇదంతా గమనించిన వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ లాభం లేదనుకొని రంగంలోకి దిగాడు. సీరియస్‌గా బ్యాటింగ్‌ చేస్తున్న వెంకటేశ్‌ అయ్యర్‌ దగ్గరకు వచ్చి ఏదో వ్యాఖ్యలు చేశాడు. దానికి అ‍య్యర్‌ కూడా నవ్వుతూ బదులిచ్చాడు. అయితే ఆ తర్వాతి బంతికే వెంకటేశ్‌ అయ్యర్‌ ఔటయ్యాడు. కుమార్‌ కార్తికేయ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ నాలుగో బంతిని కవర్స్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నంలో డేనియల్‌ సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ''అంతవరకు బాగానే ఆడాడు.. ఇషాన్‌ వచ్చి చెప్పగానే ఔటయ్యాడు.. ఏదో మతలబు జరిగింది'' అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్‌ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్‌లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు.  

చదవండి: Rohit Sharma: థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం.. రోహిత్‌ శర్మ ఔట్‌పై వివాదం

>
Poll
Loading...
మరిన్ని వార్తలు