Shubman Gill: గిల్‌ గురించి మీరు మాట్లాడేది తప్పు: జర్నలిస్టుకు విక్రమ్‌ కౌంటర్‌

24 May, 2022 16:35 IST|Sakshi
గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌(PC: IPL)

IPL 2022 GT Vs RR: గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫామ్‌లో లేడన్న జర్నలిస్టుకు ఆ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. గిల్‌ గురించి మీరు మాట్లాడేది తప్పు అంటూ సదరు వ్యక్తి ప్రశ్నకు బదులిచ్చాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత గిల్‌కు సొంతమని పేర్కొన్నాడు. కాగా మెగా వేలానికి ముందే గుజరాత్‌ టైటాన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఐపీఎల్‌-2022 ఆరంభ మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని ఈ ఓపెనర్‌.. తర్వాత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. లీగ్‌ దశ ముగిసే సరికి 14 ఇన్నింగ్స్‌లో కలిపి 403 పరుగులు సాధించి(హైయ్యస్ట్‌ స్కోరు 96) అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదమూడో స్థానంలో నిలిచాడు. ఇక హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌తో తలపడనుంది.

ఈ క్రమంలో విక్రమ్‌ సోలంకి మీడియా వర్చువల్‌ సమావేశంలో పాల్గొనగా.. ఓ జర్నలిస్టు గిల్‌ సరిగా ఆడటం లేదు అంటూ అతడి ఫామ్‌ గురించి ప్రస్తావించాడు. ఇందుకు ఘాటుగా బదులిచ్చిన సోలంకి.. ‘‘చూడండి.. మీ మాటలతో నేను ఏకీభవించను. శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు విజయాల్లో తమ సహకారం అందించారు.

ఇక గిల్‌ ఎన్నో మ్యాచ్‌లలో తన అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా లక్నోతో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ వల్లే మాకు గెలుపు దక్కింది. కాబట్టి మీరు గిల్‌ గురించి మాట్లాడేదంతా తప్పే’’ అని పేర్కొన్నాడు. ఇక హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ వల్లే తమ జట్టు ఇక్కడి వరకు చేరుకోగలిగిందని ఈ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ అన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో సమన్వయం చేసుకుంటూ తన సలహాలు, సూచనలతో ముందుకు నడిపించాడని ప్రశంసించాడు.

చదవండి👇
IPL 2022: డుప్లెసిస్‌, సంజయ్‌ సూపర్‌.. కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఇది సాధ్యమయ్యేదా!
సచిన్‌ తనయుడికి మరో అవమానం.. ముంబై రంజీ జట్టులోనూ నో ప్లేస్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు