-

Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక 

29 May, 2022 20:48 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఫైనల్‌ పోరుకు తెర లేచింది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ విషయం పక్కనబెడితే టాస్‌కు ముందు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాగా ఫైనల్‌ మ్యాచ్‌కు రవిశాస్త్రి ప్రెజంటేటర్‌గా వ్యవహరించాడు. టాస్‌ వేసిన తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.  కాగా హార్దిక్‌ను రవిశాస్త్రి ఎంతగానో ప్రోత్సహించాడు. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు హార్దిక్‌కు సపోర్ట్‌ ఇ‍స్తూ రాటుదేలేలా చేశాడు. అందుకే వీరిద్దరి భేటీ ఆసక్తిని కలిగించింది.

కాగా హార్దిక్‌ మాట్లాడుతూ.. ''టాస్‌ గెలిచి రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ చేయనుండడంతో మేం బౌలింగ్‌ చేయబోతున్నాం. అయితే ఫైనల్‌ మ్యాచ్‌కు సొంత గడ్డపై జరగడం మాకు సానుకూలాంశం. దీనికి తోడు మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మాకు మద్దతు ఇస్తుండడం మరింత బూస్టప్‌ను ఇచ్చింది. ఫైనల్‌ మ్యాచ్‌ అయినప్పటికి ఒక సాధారణ మ్యాచ్‌లానే భావిస్తున్నాం. ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మా జట్టు మొత్తం పూర్తి సంతోషంగా ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. కాగా పాండ్యా వెళ్లబోతూ శాస్తిని చూస్తూ..''మిమ్మల్ని ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నాడు. దీనికి రవిశాస్త్రి పాండ్యాను హగ్‌ చేసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

చదవండి: Hardik Pandya: 'ఫైనల్‌ మ్యాచ్‌లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్‌ టైటాన్స్‌దే కప్‌'

మరిన్ని వార్తలు