IPL 2022 Final - Hardik Pandya: శెభాష్‌.. సీజన్‌ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

30 May, 2022 08:37 IST|Sakshi
గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు

IPL 2022- Hardik Pandya Record: అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది. సీజన్‌ ఆరంభం నుంచి సమిష్టి విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచి.. నాకౌట్‌ దశలోనూ సత్తా చాటి ట్రోఫీని ముద్దాడింది. మెగా ఫైనల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2021లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోవడం, టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో వైఫల్యం సహా ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరం కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘సీవీసీ క్యాపిటల్స్‌’  అతడిని నమ్మి గుజరాత్‌ కెప్టెన్‌గా అతడికి అవకాశం ఇచ్చింది. యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హర్దిక్‌.

అంతకు ముందు కెప్టెన్సీ అనుభవం లేకపోయినా సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించి తొలి సీజన్‌లోనే టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ గెలిచిన నాలుగో భారతీయ కెప్టెన్‌గా అతడు గుర్తింపు పొందాడు.

గతంలో ఎంఎస్‌ ధోని (4 సార్లు–చెన్నై సూపర్‌ కింగ్స్‌; 2010, 2011, 2018, 2021), గౌతమ్‌ గంభీర్‌ (2 సార్లు–కోల్‌కతా నైట్‌రైడర్స్‌; 2012, 2014), రోహిత్‌ శర్మ (5 సార్లు–ముంబై ఇండియన్స్‌; 2013, 2015, 2017, 2019, 2020) ఈ ఘనత సాధించారు. ఇక గుజరాత్‌ గెలవడంలో సారథిగానే కాకుండా ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

చదవండి 👇
Hardik Pandya: సాహో హార్దిక్‌.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు..  అయినా
ఐపీఎల్‌ చరిత్రలో యజ్వేంద్ర చహల్‌ సరికొత్త రికార్డు

మరిన్ని వార్తలు