IPL 2023 PBKS Vs MI: ముంబై ప్రతీకారం.. పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం

4 May, 2023 11:10 IST|Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.

ఇషాన్‌ కిషన్‌ 75, సూర్యకుమార్‌ 66 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను పటిష్ట స్థితిలో నిలపగా.. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌(10 బంతుల్లో 19 నాటౌట్‌), తిలక్‌ వర్మ(10 బంతుల్లో 26 నాటౌట్‌) ముంబైని విజయతీరాలకు చేర్చారు. పంజాబ్‌ బౌలర్లలో నాథన్‌ ఎల్లిస్‌ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, రిషి ధవన్‌ చెరొక వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబై సీజన్‌ ఆరంభంలో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.

► ఇషాన్‌ కిషన్‌ 75 పరుగులు చేసి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రిషి ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 178 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

స్కై సంచలన ఇన్నింగ్స్‌కు తెర.. మూడో వికెట్‌ డౌన్‌
31 బంతుల్లో 66 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో సూర్య అర్ష్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. కాగా మూడో వికెట్‌కు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌లు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 75, టిమ్‌ డేవిడ్‌ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

సూర్య, ఇషాన్‌లు అర్థసెంచరీలు.. విజయం దిశగా ముంబై
సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లు ధాటిగా ఆడుతుండడంతో ముంబై లక్ష్యచేధనలో దూసుకెళ్తుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 52, ఇషాన్‌ కిషన్‌ 57 పరుగులతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 215.. 9 ఓవర్లలో ముంబై 80/2
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 30, సూర్యకుమార్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 


Photo Credit : IPL Website

ముంబై బౌలర్లు విఫలం.. పంజాబ్‌ 20 ఓవర్లలో 214/3
ముంబై బౌలర్ల వైఫల్యంతో పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్‌ లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్‌, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్‌ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. శిఖర్‌ ధావన్‌ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో పియూష్‌ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.


Photo Credit : IPL Website

దంచికొడుతున్న లివింగ్‌స్టోన్‌.. 16 ఓవర్లలో 152/3
పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ లివింగ్‌స్టోన్‌ తొలిసారి తన విధ్వంసం ప్రదర్శిస్తున్నాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ 49, జితేశ్‌ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

13 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 120/2
13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ 28, జితేశ్‌ శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

శిఖర్‌ ధావన్‌(30) ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(30 పరుగులు) పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ కింగ్స్‌..
9 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్‌ స్కోరు 17/1గా ఉంది.


Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

గత మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మళ్లీ గెలుపు ట్రాక్‌ ఎక్కిన ముంబై అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు బలమైన సీఎస్‌కేను ఓడించి పంజాబ్‌ కింగ్స్‌ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో ఇరుజట్ల మధ్య 30 సార్ల తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌నే విజయం వరించింది. 

మరిన్ని వార్తలు