IPL 2023: మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్‌లో.. ఎస్‌ఆర్‌హెచ్‌ షెడ్యూల్‌ ఇదే

17 Feb, 2023 21:50 IST|Sakshi

ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరగనున్న ఐపీఎల్‌ 2023లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్కే మధ్య జరగనుంది. ఇక కరోనా కారణంగా మూడేళ్ల పాటు సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఆయా జట్లు ఈసారి మాత్రం హోంగ్రౌండ్‌లో ఆడబోతున్నాయి. దీంతో అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

ఇక చాలా రోజుల తర్వాత మరోసారి ఐపీఎల్ హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. గత మూడు సీజన్లుగా కరోనా కారణంగా ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయింది. అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ అభిమానుల కేరింతలతో మురిసిపోనుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడు మ్యాచ్‌లను హోంగ్రౌండ్‌లో.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో తటస్థ వేదికల్లో ఆడనుంది. 

ఈసారి ఎస్‌ఆర్‌హెచ్‌ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. గతేడాది 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన సన్ రైజర్స్ సొంతగడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్ రైజర్స్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ పూర్తి జట్టు: అబ్దుల్ సమద్, ఐడెన్ మర్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, సంవ్రక్రాంత్ మర్కండే, మయన్‌క్రాంత్ మర్కండే వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకేల్ హోసేన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్.

సన్ రైజర్స్ పూర్తి షెడ్యూల్:
ఏప్రిల్ 2 - సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్
ఏప్రిల్ 7 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన రైజర్స్, లక్నో
ఏప్రిల్ 9 - సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్
ఏప్రిల్ 14 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్, కోల్‌కతా
ఏప్రిల్ 18 - సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్
ఏప్రిల్ 21 - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్, చెన్నై
ఏప్రిల్ 24 - సన్ రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్

ఏప్రిల్ 29 - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్, ఢిల్లీ
మే 4 - సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైజర్స్, హైదరాబాద్‌
మే 7 - రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్, జైపూర్
మే 13 - సన్ రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్
మే 15 - గుజరాత్ టైటన్స్ vs సన్ రైజర్స్, అహ్మదాబాద్‌
మే 18 - సన్ రైజర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్
మే 21 - ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్, ముంబై

చదవండి: ఐపీఎల్‌ 2023 షెడ్యూల్‌ విడుదల.. మార్చి 31న షురూ

మరిన్ని వార్తలు