IPL 2023: ముంబై బ్యాటర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో వైరల్‌

31 Mar, 2023 20:18 IST|Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఇప్పటికే జట్టుతో కలిసిన డేవిడ్‌.. ముంబైలోని బ్రబౌర్న్‌ వేదికగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో డేవిడ్‌ తన హార్డ్‌ హిట్టింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్నాడు. గురువారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో డేవిడ్‌ విధ్వంసం సృష్టించాడు.

ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు సాయంతో 23 పరుగలు సాధించి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన అతడు.. రెండో బంతికి రెండు పరుగులు, మూడో బంతికి ఫోర్‌, అనంతరం రెండు సిక్స్‌లు, ఓ సింగిల్‌తో ఓవర్‌ను ముగించాడు.

డేవిడ్‌ పవర్‌ హిట్టింగ్‌ సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో టిమ్‌ డేవిడ్‌ను రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌-2022లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ 186 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఏ మెరకు డేవిడ్‌ రాణిస్తాడో వేచి చూడాలి. కాగా ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌2న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో తలపడనుంది.


చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో

మరిన్ని వార్తలు