IPL 2023 Final: 'రిజర్వ్‌ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!

29 May, 2023 07:03 IST|Sakshi
PC: IPL Twitter

వర్షం కారణంగా నేటికి (మే 29) వాయిదా పడిన ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌.. రిజర్వ్‌ డే రోజు కూడా సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నటి లాగా భారీ వర్షం కురవకపోవచ్చని సమాచారం.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్‌ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్‌ ఓవర్‌’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్‌ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ చాంపియన్‌గా నిలుస్తుంది. కాగా, ఐపీఎల్‌ 2023 ఫైనల్స్‌కు గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేరిన విషయం తెలిసిందే.

చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్‌-1 విజేత

మరిన్ని వార్తలు