-

IPL 2024 Retention-Release Players: కేకేఆర్‌లో భారీ ప్రక్షాళన.. షకీబ్‌కు షాక్‌.. రసెల్‌, నరైన్‌ కొనసాగింపు

26 Nov, 2023 17:31 IST|Sakshi
Courtesy: IPL

ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ (నిలబెట్టుకోవడం), రిలీజ్‌ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్‌ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు  తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.

అన్ని ఫ్రాంచైజీలు ఓ మోస్తరుగా మార్పులు చేర్పులు చేయగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం భారీ ప్రక్షాణన చేపట్టింది. ఈ ఫ్రాంచైజీ ఏకంగా 12 మంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసి, 13 మందిని అట్టిపెట్టుకుంది. కేకేఆర్‌ యాజమాన్యం కెప్టెన్‌ పేరును సైతం ప్రకటించలేదు.   

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

షకీబ్‌ అల్‌ హసన్‌
లిట్టన్‌ దాస్‌
ఆర్య దేశాయ్‌
డేవిడ్‌ వీస్‌
నారాయణ్‌ జగదీశన్‌
మన్‌దీప్‌ సింగ్‌
కుల్వంత్‌ కెజ్రోలియా
శార్ధూల్‌ ఠాకూర్‌
లోకీ ఫెర్గూసన్‌
ఉమేశ్‌ యాదవ్‌
టిమ్‌ సౌథీ
జాన్సన్‌ చార్లెస్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..
నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జేసన్‌ రాయ్‌, సునీల్‌ నరైన్‌, సుయాశ్‌ శర్మ, ఆండ్రీ రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి


 

మరిన్ని వార్తలు