2008-2020: ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

18 Feb, 2021 09:38 IST|Sakshi

చెన్నై: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్- 2021 వేలం‌) మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 292 మంది ఆటగాళ్లలో అదృష్టం ఎవరిని వరించనుందో తేలనుంది. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మినీ వేలం ప్రారంభం కానుంది. 164 మంది టీమిండియా క్రికెటర్లు , 125 మంది  విదేశీ ప్లేయర్లు, ముగ్గురు అసోసియేట్‌ ఆటగాళ్లలో కేవలం 61 మందిని మాత్రమే ఫ్రాంఛైజీలు ఎంచుకోనున్నాయి. దీంతో క్రీడాభిమానుల్లో ఈ ఈవెంట్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరా అన్న అంశం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో గత సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు, అతడిని దక్కించుకున్న జట్టు, ధర తదితర వివరాలు ఓ సారి పరిశీలిద్దాం.

సీజన్‌   ప్లేయర్‌  జట్టు  ధర 
2020 ప్యాట్‌ కమిన్స్‌  కోల్‌కతా నైట్‌రైడర్స్‌          రూ .15.5 కోట్లు
2019   జయదేవ్ ఉనద్కత్  రాజస్తాన్‌ రాయల్స్‌   రూ.8.4 కోట్లు
2019 వరుణ్ చక్రవర్తి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్        రూ.8.4 కోట్లు
2018  బెన్‌స్టోక్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌   రూ. 12.5 కోట్లు
2017  బెన్‌ స్టోక్స్‌   రైజింగ్‌ పుణె సూపర్‌జాయింట్స్ రూ. 14.5 కోట్లు
2016 షేన్‌ వాట్సన్‌       రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 9.5 కోట్లు
2015  యువరాజ్‌ సింగ్‌  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌  రూ. 16 కోట్లు
2014  యువరాజ్‌ సింగ్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 14 కోట్లు
2013   గ్లెన్‌​ మాక్స్‌వెల్‌    ముంబై ఇండియన్స్ 1 మిలియన్‌ డాలర్లు
2012  రవీంద్ర జడేజా      చెన్నై సూపర్‌ కింగ్స్ 2 మిలియన్‌ డాలర్లు
2011  గౌతం గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌ 2.4 మిలియన్‌ డాలర్లు
2010 కీరన్‌ పొలార్డ్  ముంబై  ఇండియన్స్‌ 0.75 మిలియన్‌ డాలర్లు
2010 షేన్‌ బాండ్ ‌కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 0.75 మిలియన్‌ డాలర్లు
2009 ఆండ్రూ ఫ్లింటాఫ్ చెన్నై సూపర్‌ కింగ్స్ 1.55 మిలియన్‌ డాలర్లు
2009 కెవిన్‌ పీటర్సన్‌  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 1.55 మిలియన్‌ డాలర్లు
2008      ఎంఎస్‌ ధోని చెన్నై సూపర్‌ కింగ్స్ 1.5 మిలియన్ డాలర్లు

చదవండిశార్దూల్‌ స్థానంలో సీనియర్‌ సీమర్‌ జట్టులోకి

>
మరిన్ని వార్తలు