షారూక్‌ ఖాన్‌ని‌ కొనేసిన ప్రీతి జింటా..

20 Feb, 2021 09:44 IST|Sakshi

షారూక్‌ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్‌ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్‌ ఖాన్‌ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్‌ ఖాన్‌ కాదు. క్రికెటర్‌ షారూక్‌ ఖాన్‌. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్‌ కింగ్స్‌ ఐపిఎల్‌ టీమ్‌ ఈ రైట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. 

దాంతో ఇప్పుడు నెటిజన్స్‌ అందరూ ఎవరీ షారూక్‌ ఖాన్‌ అని గూగుల్‌ చేస్తున్నారు. షారూక్‌ ఖాన్‌ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్‌. 2012లో జూనియర్‌ ఐపిఎల్‌ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్‌ సింగిల్స్‌ తీస్తాడని పేరు. స్విమ్మింగ్‌ చాంపియన్‌ అట కూడా. షారూక్‌ ఖాన్‌ క్రేజ్‌ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్‌ దాంతో ఐపిఎల్‌ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్‌లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

మరోవైపు నటుడు షారూక్‌ ఖాన్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్‌కు షారూక్‌ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్‌ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్‌ ఖాన్‌’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్‌ ఖాన్‌ వంతు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు