IPL 2022 Mega Auction: 23 మంది ఆటగాళ్లతో కూడిన ఆరెంజ్‌ ఆర్మీ ఇదే..

14 Feb, 2022 15:49 IST|Sakshi

రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలం నిన్నటితో ముగిసింది. లీగ్‌లో పాల్గొనబోయే 10 జట్లు తమతమ పర్స్‌లలోని డబ్బులకు సరిపడా ఆటగాళ్లను కొనుగోలు చేసి ఐపీఎల్‌ 2022 మెగా ఫైట్‌కు ఇప్పటినుంచే కత్తులు నూరుతున్నాయి. ఈ సారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన జట్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

తమ వద్ద ఉన్న 68 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం యువ క్రికెటర్ల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా తెలిసింది. కేన్ విలియమ్సన్‌(14 కోట్లు), అబ్దుల్ సమద్(4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్‌(4 కోట్లు)లను రిటైన్ చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. మెగా వేలంలో 67.9 కోట్లు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్‌ ఫైట్‌లో తలపడబోయే ఎస్‌ఆర్‌హెచ్‌ పూర్తి జాబితా ఇదే..

రిటైన్డ్‌ ఆటగాళ్లు: 

  • కేన్‌ విలియమ్సన్‌(14 కోట్లు), కెప్టెన్‌ 
  • అబ్దుల్ సమద్(4 కోట్లు) 
  • ఉమ్రాన్ మాలిక్‌(4 కోట్లు)

మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

  • నికోలస్‌ పూరన్‌(10.75 కోట్లు)
  • వాషింగ్టన్‌ సుందర్‌(8.75 కోట్లు)
  • రాహుల్‌ త్రిపాఠి(8.5 కోట్లు)
  • రొమారియో షెపర్డ్‌(7.7 కోట్లు)
  • అభిషేక్‌ శర్మ(6.5 కోట్లు)
  • భువనేశ్వర్‌ కుమార్‌(4.2 కోట్లు)
  • మార్కో జన్సెన్‌(4.2 కోట్లు)
  • టి నటరాజన్‌(4 కోట్లు)
  • కార్తీక్‌ త్యాగి(4 కోట్లు)
  • ఎయిడెన్‌ మార్క్రమ్‌(2.6 కోట్లు)
  • సీన్‌ అబాట్‌(2.4 కోట్లు)
  • గ్లెన్‌ ఫిలిప్‌(1.5 కోట్లు)
  • శ్రేయస్‌ గోపాల్‌(75 లక్షలు)
  • విష్ణు వినోద్‌(50 లక్షలు)
  • ఫజల్‌ హక్‌ ఫారుఖి(50 లక్షలు)
  • జె సుచిత్‌(20 లక్షలు)
  • ప్రియమ్‌ గార్గ్‌(20 లక్షలు)
  • ఆర్‌ సమర్థ్‌(20 లక్షలు)
  • శశాంక్‌ సింగ్‌(20 లక్షలు)
  • సౌరభ్‌ దూబే(20 లక్షలు)

    చదవండి: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్‌ తీరే వేరు
మరిన్ని వార్తలు