ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్‌లో...

23 Sep, 2022 04:30 IST|Sakshi

వచ్చే ఏడాది ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో పాత ఫార్మాట్‌లో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. కరోనాకు ముందు ఉన్న విధంగా ప్రతీ జట్టు తమ సొంత మైదానంలో ఒక మ్యాచ్, ప్రత్యర్థి మైదానంలో మరో మ్యాచ్‌  ఆడుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో 10 జట్లు ఉండగా, ప్రతీ టీమ్‌ మిగిలిన 9 టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది.

2022లో ఐపీఎల్‌ పూర్తిగా భారత్‌లోనే జరిగినా... కొన్ని వేదికలకే లీగ్‌ను పరిమితం చేశారు. వచ్చే సీజన్‌నుంచి అంతా సాధారణంగా మారిపోతుందని గంగూలీ స్పష్టం చేశారు. మరో వైపు 2023 సీజన్‌తో పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్‌ కూడా నిర్వహిస్తామని గంగూలీ చెప్పారు. దీంతో పాటు టీనేజ్‌ అమ్మాయిల ప్రతిభను గుర్తించేందుకు తొలిసారి జాతీయ స్థాయిలో   బాలికల అండర్‌–15 టోర్నీ కూడా జరపనున్నట్లు  సౌరవ్‌ గంగూలీ   వివరించారు.

మరిన్ని వార్తలు