ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం..

22 Jan, 2021 21:15 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. రాబోయే సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని  బీసీసీఐ అధికారి  శుక్రవారం  పీటీఐకి తెలిపారు. 'ఫిబ్రవరి 18న వేలం జరగనుంది. వేదికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అధికారి చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందా లేదా అనే విషయంపై  బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే పేర్కొన్నారు. కాగా సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో భారత్‌ సిరీస్‌ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్‌ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది.
చదవండి: 'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి'

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు