నీ కెప్టెన్‌ సూపర్బ్‌: పుజారా కుమార్తె కమెంట్‌ వైరల్‌

20 Feb, 2021 11:36 IST|Sakshi

ధోనీపై పుజారా కూతురు అదితి వ్యాఖ్యలు వైరల్‌ 

ఐపీఎల్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వడం సంతోషం  విజిల్‌ పోడు : పుజారా

సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సమరానికి కీలక అంకం ముగిసింది. ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఆయా జట్లు సభ్యులు ఖరారైపోయారు. దీంతో  రేసు గుర్రాలాంటి జట్టు  సభ్యుల ఆనంతోద్సాహాల మధ్య క్రికెట్‌ అభిమానుల్లో కూడా ఐపీఎల్‌ సందడి షురూ అయింది. ఈ  నేపథ్యంలో టీమిండియా టెస్టు బ్యాట్స్‌మెన్ పుజారా ముద్దుల తనయ అదితి మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. అదితి వ్యాఖ్యలు క్రీడాభిమానులను ఇపుడు తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎంఎస్‌‌ ధోనీ ఫ్యాన్స్‌ అయితే ఫిదా!

రూ. 50 లక్షలతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎంపికైన  చతేశ్వర్‌ పుజారా తిరిగి ఐపీఎల్‌ సమరంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  ఏడేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్‌లో అడనున్న సందర్భంగా ఐపీఎల్‌లో చేరడం సంతోషంగా ఉందంటూ పుజారీ ఒక వీడియో విడుదల చేశారు. చెన్నై యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోలో "మహీబాయ్‌ కెప్టెన్సీలో ఆడేందుకు అవకాశం రావడం చాలా సంతోషం... ధోనీ నాయకత్వంలోనే టెస్ట్ మ్యాచ్‌ ఆరంగేట్రం చేశాను. ధోనీ భాయ్‌తో మంచి అనుభవాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మళ్లీ అతనితో కలిసి యెల్లో జెర్సీతో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. సాధ్యమైనంత తొందరగా టెస్ట్ ఫార్మాట్‌ నుంచి ఐపీఎల్ లాంటి క్విక్ ఫార్మాట్‌లోకి మారేందుకు మానసికంగా చాలా సిద్దం కావాలి.. విజిల్‌ పోడు’’ అంటూ పుజారా తన ఆనందాన్ని వ్యక‍్తం చేశారు. ఆయన కూతురు 'ఉంగ తలా సుపరూ'( మీ కెప్టెన్ సూపర్బ్‌‌) అంటూ కమెంట్‌ చేయడం విశేషంగా నిలిచింది.అంతేకాదు పెద్ద ఆరిందాలా. వాళ్ల డాడీ చెప్పిందానికి తన చిన్ని తల ఊపుతూ ఆస్వాదించడం మరో విశేషం.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తన అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పుజారీ తమజట్టులో చేరడంపై ఫ్రాంచైజీ ఆనందం వ్యక్తం చేసింది. 

కాగా ఐపీఎల్ 2021 లో ధోని చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. దీంతో ఐపీఎల్‌లో రూ.150 కోట్లకు పైగా ఆర్జించిన తొలి క్రికెటర్‌గా సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రికార్డు సాధించాడు. 2020 వరకు అతడు లీగ్‌ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం పొందగా,చెన్నై ఫ్రాంచైజీ ఈ ఏడాది సీజన్‌కు కూడా కొనసాగించడంతో ధోనీ సంపాదన రూ.152 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు