Amy Hunter: అమీ హంటర్ సంచలన రికార్డు.. మిథాలీ రికార్డు బద్దలు

11 Oct, 2021 17:56 IST|Sakshi

Amy Hunter Becomes Youngest Batter to Hit International Century:  ప్రపంచ మహిళా క్రికెట్‌ చరిత్రలో ఐర్లాండ్ మహిళా క్రికెటర్ అమీ హంటర్ సంచలన రికార్డు సృష్టించింది.  జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో 127 బంతుల్లో 7 ఫోర్లతో 121 పరుగులు చేసిన హంటర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన  మహిళా  క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. 16 ఏళ్ల అమీ హంటర్.. ఇంతకు ముందు భారత కెప్టెన్‌  మిథాలీరాజ్ పేరిట ఉన్న ఈ  రికార్డును బ్రేక్‌ చేసింది.

అయితే ఆమె  తన పుట్టినరోజునే ఈ ఘనతను సాధించడం గమనార్హం. విదేశాల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఐర్లాండ్ మహిళా క్రికెటర్‌గానూ అమీ హంటర్ రికార్డు క్రియాట్‌ చేసింది.  ​ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన  ఐర్లాండ్ నీర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. కాగా 25 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 110 పరగులు చేసింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌ కోనసాగుతుంది.

చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి...

మరిన్ని వార్తలు