Irfan Pathan: అతడు వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే..

30 Nov, 2021 16:55 IST|Sakshi

Irfan Pathan feels KKRs all rounder Venkatesh Iyer can become a hot pick at a mega auction:  ఐపీఎల్‌ 14వ సీజన్‌లో అదరగొట్టిన కేకేఆర్‌ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఒక వేళ అయ్యర్‌ను కోల్‌కతా రీటైన్‌ చేసుకోపోతే.. రానున్న మెగా వేలంలో అయ్యర్‌కు భారీ ధర దక్కనుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల లిస్టును నవంబర్‌ 30 న సమర్పించునున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయా జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఆ జాబితాలో కచ్చితంగా ఒక విదేశీ ఆటగాడు ఉండాలి. 

"కేకేఆర్‌లో రస్సెల్‌, సునీల్‌ నరైన్‌  స్టార్‌ ఆల్‌ రౌండర్‌లుగా ఉన్నారు. వాళ్లు ఎన్నో అద్బుతమైన విజయాలు ఆ జట్టుకు అందించారు. కావున వాళ్లు ఇద్దరినీ వేలానికి విడుదల చేయడానికి కేకేఆర్ ఇష్టపడకపోవచ్చు. కానీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అయితే వాళ్లకు తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉంది. మరోవైపు కేకేఆర్ లాకీ ఫెర్గూసన్ గురించి ఆలోచించవచ్చు. అతడు కొత్త బంతితో  యార్కర్లను బౌలింగ్ చేయడంలో దిట్ట. ప్యాట్ కమ్మిన్స్ కంటే లూకీ ఫర్గూసన్‌ని అట్టిపెట్టుకుంటే మంచిది అని" పఠాన్ పేర్కొన్నాడు.

ఇక మూడో ఆటగాడి గురించి మాట్లాడూతూ.. శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా రీటైన్‌ చేసుకునే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్‌ గత సీజన్‌లో అద్బుతంగా రాణించాడు. నాలుగో స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా నితీష్ రానా గురించి కేకేఆర్‌ ఆలోచిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం నాలుగవ ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్‌ను రీటైన్‌ చేసుకుంటే బెటర్‌. ఎందుకంటే అతడు బ్యాట్‌తోను, బాల్‌తో రాణించగలడు. ఒక వేళ అయ్యర్‌ వేలం లోకి వెళ్తే.. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడతాయి అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.

చదవండి: Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్‌ హాగ్‌

మరిన్ని వార్తలు