Irfan Pathan: 'ఆ ఐడియా నాదే.. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు పంపిస్తున్నా'

18 Aug, 2022 18:06 IST|Sakshi

ఐపీఎల్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌ బుధవారం తమ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా రంజీ దిగ్గజం చంద్రకాంత్‌ పండిట్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆరుసార్లు రంజీ ట్రోపీ గెలిపించిన కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంతోనే కేకేఆర్‌ సగం సక్సెస్‌ అయిందని.. ఇక ఈసారి కచ్చితంగా కేకేఆర్‌ టైటిల్‌ కొట్టబోతుందని అభిమానులు పేర్కొన్నారు. కాగా చంద్రకాంత్‌ పండిట్‌ నియామకంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ నడిచింది. 

విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌ రంజీ ట్రోపీ-2022 విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్‌ రంజీ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ పాత్ర కీలకం. ఒకప్పుడు కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ పఠాన్‌ అభినందిస్తూ ఒక ట్వీట్‌ చేశాడు.'' కంగ్రాట్స్‌ మధ్యప్రదేశ్‌.. రంజీ ట్రోపీ గెలిచినందుకు. చంద్రకాంత్‌ పండిట్‌ మ్యాజిక్‌ మరోసారి పనిచేసింది. అతనికి ఐపీఎల్‌ కోచ్‌గా కాంట్రాక్ట్‌ ఇస్తే ఎలా ఉంటుంది'' అని ట్వీట్‌ చేశాడు.

తాజాగా కేకేఆర్‌ కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ ఎంపికైన నేపథ్యంలో ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్‌... ఇర్ఫాన్‌ పఠాన్‌ పాత ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ''ఇర్ఫాన్‌ భయ్యా.. మీ మాటలు విన్నాం.. అందుకే'' అంటూ లాఫింగ్‌ ఎమోజీ షేర్‌ చేశాడు. దీనిపై ఇర్ఫాన్‌ స్పందిస్తూ.. ''హాహా.. వెంకీబాయ్‌ ఉన్నా.. మీకు(వెంకీ మైసూర్‌).. అలాగే కొత్త కోచ్‌గా వచ్చిన చందు భాయికి(చంద్రకాంత్‌ పండిట్‌) ఆల్‌ ది బెస్ట్‌. అలాగే చందు భయ్యాను కోచ్‌గా తీసుకోవాలనే ఐడియా నేనే ఇచ్చా.. అందుకే నా బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు పంపతున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌.. మరోసారి కప్‌ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్‌ మోర్గాన్‌ సారధ్యంలో ఫైనల్‌ చేరినప్పటికి.. సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కేకేఆర్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్‌ చేరడంలో విఫలమైన కేకేఆర్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్‌ దశ మారనుందా!

IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్‌!

మరిన్ని వార్తలు