‘అందుకే కోహ్లిని లీడర్‌ అంటాం’

19 Mar, 2021 13:34 IST|Sakshi

అహ్మదాబాద్ : ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫేవరెట్ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్‌ కోసం త్యాగం చేశాడు. ఈ సీరీస్‌ లో రెండో టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యాదవ్‌కి ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఆ తర్వాత మూడో టీ20లో అతడిని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో కోహ్లికి మూడో స్థానంలో ఆడే అవకాశం ఉన్నా తాను కాదని సూర్యను ఆ స్థానంలో పంపాడు. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. దాంతో.. నెం.3 బ్యాటింగ్ స్ధానంలో కోహ్లీ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే భారీ సిక్స్‌తో బోణి కొట్టడమే కాక చక్కటి ఇన్నింగ్స్‌ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యాదవ్ (57; 31 బంతుల్లో 6x4,3x6) హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ( 1) పరుగుతో వెనుదిరిగాడు.

మ్యాచ్‌ అనంతరం కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ భారత మాజీ ఫాస్ట్ ఇర్ఫాన్ పఠాన్ ‘కోహ్లీని లీడర్‌గా నేను గౌరవించడానికి కారణం ఇదే. కొత్తగా భారత్ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇవ్వడం కోసం తన ఫేవరెట్‌ బ్యాటింగ్ పొజీషన్‌ని త్యాగం చేశాడని’ కొనియాడాడు. మరోవైపు నెటిజన్లు కూడా కోహ్లీ త్యాగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో జరిగిన మూడో టీ20లోనూ యువ హిట్టర్ ఇషాన్ కిషన్ కోసం కోహ్లీ తన నెం.3 స్థానాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే.   (చదవండి :సూర్య ప్రతాపం.. భారత్‌ విజయం

మరిన్ని వార్తలు