క్వారంటైన్‌ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నా: ఇషాంత్‌

23 May, 2021 19:04 IST|Sakshi

ముంబై: టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ క్వారంటైన్‌ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నట్లుగా అనిపి​స్తుంది. మరో 25 రోజుల్లో  ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో ఇషాంత్‌ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని  టీమిండియా జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. అంతవరకు ముంబైలోని ఒక హోటల్లో ఆటగాళ్లంతా కఠిన నిబంధనల మధ్య క్వారంటైనల్‌లో ఉండనున్నారు. ఇంగ్లండ్‌కు వెళ్లిన అనంతరం అక్కడ మరో వారం రోజుల పాటు ఐపోలేషన్‌లో గడపనునన్నారు. కాగా టీమిండియా జూన్‌ 18 నుంచి 22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.

తాజాగా ఇషాంత్‌ శర్మ ఎక్సర్‌సైజ్‌ మూమెంట్స్‌కు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. వీడియోలో డిఫరెంట్‌ యాంగిల్స్‌లో కసరత్తులు చేస్తున్నట్లుగా ఉంది. ''మన బ్రెయిన్‌ ఏం నమ్ముతుందో.. శరీరం కూడా అదే చేయడానికి యత్నిస్తుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇషాంత్‌ వీడియోనూ ట్యాగ్‌ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌.. ''ఇషాంత్‌ క్వారంటైన్‌ టైమ్‌ను గట్టిగా వాడేస్తున్నాడు'' అంటూ కామెంట్‌ చేసింది.

ఇషాంత్‌ శర్మ ఇటీవలే రద్దైన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సీజన్‌ రద్దయ్యే సమయానికి ఇషాంత్‌ మూడు మ్యాచ్‌లాడి 1 వికెట్‌ తీశాడు. ఇక ఇషాంత్‌ శర్మ టీమిండియా తరపున 100 టెస్టులు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత టెస్టు జట్టులో వంద టెస్టు మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా ఇషాంత్‌ నిలిచాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్లకు దూరమైన ఇషాంత్‌ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇషాంత్‌ టీమిండియా తరపున 101 టెస్టుల్లో 303 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు.
చదవండి: WTC Final: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెటర్‌

ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్‌

A post shared by Ishant Sharma (@ishant.sharma29)

మరిన్ని వార్తలు