ఐఎస్‌ఎల్‌ విజేత ఏటీకే మోహన్‌ బగాన్‌

19 Mar, 2023 04:42 IST|Sakshi

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) టైటిల్‌ను ఏటీకే మోహన్‌ బగాన్‌ (కోల్‌కతా) ఫుట్‌బాల్‌ క్లబ్‌ తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏటీకే మోహన్‌ బగాన్‌ ‘పెనాల్టీ షూటౌట్‌’లో 4–3తో బెంగళూరు ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.

అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ అనివార్యమైంది. ‘షూటౌట్‌’ లో మోహన్‌ బగాన్‌ తరఫున వరుసగా పెట్రాటోస్, లిస్టన్, కియాన్, మాన్వీర్‌ గోల్స్‌ చేశారు. బెంగళూరు తరఫున అలన్‌ కోస్టా, రాయ్‌ కృష్ణ, సునీల్‌ చెత్రి సఫలంకాగా... రమిరెస్, పెరెజ్‌ విఫలమయ్యారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు