ఈసారి ఐపీఎల్‌ వేలం కొత్త ప్రదేశంలో.. పరిశీలనలో బెంగళూరు కూడా..!

26 Oct, 2022 13:12 IST|Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌ కోసం జరిగే మినీ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. ఐపీఎల్‌ కొత్త చైర్మన్‌గా ఎన్నికైన అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌, కొత్త బ్రాడ్‌కాస్టర్‌ వయాకామ్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఈ విషయంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బీసీసీఐ-ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ చర్చల్లో మినీ వేలం నిర్వహించే వేదికను టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ముందుగా అనుకున్న వేదిక బెంగళూరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బీసీసీఐ-ఐపీఎల్‌ అధికారులంతా ఇస్తాంబుల్‌ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ విషయంపై తుది నిర్ణయం నవంబర్‌ తొలి వారంలో వెలువడే అవకాశం ఉంది. వేదిక మాట అటుంచితే.. ఐపీఎల్‌-2023కి సంబంధించి మినీ వేలాన్ని నిర్వహించే తేదీని డిసెంబర్‌ 16గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్‌ వ్యాల్యూని కూడా సవరించారని సమాచారం. పర్స్‌ వ్యాల్యూని రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచారని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
చదవండి: ఐపీఎల్‌-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారు..!

Poll
Loading...
మరిన్ని వార్తలు