వార్నర్‌కు గాయమైతే మాకు మంచిదే కదా..!

30 Nov, 2020 15:01 IST|Sakshi

సిడ్నీ: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. దాంతో మిగిలిన వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. వార్నర్‌కు గజ్జల్లో గాయం కావడంతో ఫీల్డింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దాంతో మైదానాన్ని మధ్యలోనే వీడాడు. వార్నర్‌ కోలుకోవడానికి ఎన్ని వారాలు సమయం పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది కూడా అనుమానంగా మారింది. వార్నర్‌ ప్లేస్‌లో టీ20లకు డీఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేయగా, మూడో వన్డేకు వార్నర్‌ స్థానంలో లబూషేన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. కాగా, వార్నర్‌ గాయంపై టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ జోక్స్‌ పేల్చాడు.  వార్నర్‌కు అయిన గాయం కొంతకాలం వరకూ నయం కాకుంటే మంచిదేనని చమత్కరించాడు. (చదవండి: కోహ్లి 2020)

రెండో వన్డే ముగిసిన తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడిన రాహుల్‌కు వార్నర్‌ గాయం గురించి ప్రశ్న ఎదురు కాగా, మంచిదే కదా అంటూ నరదాగా వ్యాఖ్యానించాడు.  అలా గాయంతో మ్యాచ్‌కు ఏ ఆటగాడు దూరం కావడాన్ని తాను కోరుకోనని, కాకపోతే వార్నర్‌ ఒక ప్రధాన ఆటగాడు కదా..అతను దూరమైతే తమ జట్టుకు మంచిదే నంటూ అక్కడున్నవారిలో నవ్వులు పూయించాడు. రెండో వన్డేలోనూ ఆసీస్‌ గెలవడంతో టీమిండియా ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. ఆసీస్‌ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.(చదవండి: ‘బుమ్రాను ఎలా వాడాలో తెలియని కెప్టెన్సీ ఇది’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా