IPL 2022: 'భారీ తేడాతో ఓడిపోయాం.. తరువాతి మ్యాచ్‌లో మేము ఏంటో చూపిస్తాం'

9 May, 2022 18:27 IST|Sakshi
రికీ పాటింగ్‌(PC: ipl)

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ ఓటమిపై హెడ్‌ కోచ్‌ రికీ పాటింగ్‌ స్పందించాడు. సీఎస్‌కేపై భారీ తేడాతో ఓటమి చెందడం తమ జట్టు నెట్ రన్ రేట్‌ను దెబ్బతీసిందని పాటింగ్‌ తెలిపాడు.  "ఈ మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఓడిపోయాం. ఈ ఓటమి మా నెట్ రన్ రేట్‌పై భారీ ప్రభావం చూపింది. మా తదుపరి మ్యాచ్‌లో మేము బలంగా పుంజుకోవాలి.

మరో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోగలమని మేము భావిస్తున్నాము.  ప్లేఆఫ్‌కు చేరడానికి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే చాలు. అయితే ఒక మ్యాచ్‌లో భారీ విజయం సాధించి మా రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవాలి. అదే విధంగా ఫీల్డ్‌లో పంత్‌ తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. ఏ కెప్టెన్‌కైనా ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఒక కెప్టెన్ చాలా తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడు. ఏ నిర్ణయం​ తీసుకున్న జట్టు విజయాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటాడు" అని మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో రికీ పాటింగ్‌ పేర్కొన్నాడు.

చదవండి: CSK VS DC: డెవాన్‌ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు