-

Shubman Gill: క్రిప్టిక్‌ ట్వీట్‌పై వివరణ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం

17 Sep, 2022 21:15 IST|Sakshi

ప్రస్తుత ఐపీఎల్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెట్‌ అభిమానులను తికమక పెట్టింది. ఆ జట్టు యాజమాన్యం ఇవాళ (సెప్టెంబర్‌ 17) మధ్యాహ్నం ఓ క్రిప్టిక్‌ ట్వీట్‌ పెట్టి ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురి చేసింది. ఆ ట్వీట్‌లో తమ స్టార్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ జట్టును వీడనున్నాడని అర్ధం వచ్చేలా.. గుజరాత్‌ టైటాన్స్‌తో నీ ప్రయాణం మరువలేనిది,  నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. 

ఈ ట్వీట్‌ను గిల్‌ సైతం ధృవీకరించినట్లు ఓ క్రిప్టెడ్‌ ట్వీట్‌ను పోస్ట్‌ చేసింది. ఈ ట్వీట్‌ పోస్ట్‌ చేసిన సెకెన్ల వ్యవధిలోనే వైరల్‌ కావడంతో గుజరాత్‌ యాజయాన్యం అలర్ట్‌ అయ్యింది. ఆ ట్వీట్‌ అర్ధం మీరనుకున్నది కాదు.. గిల్‌ ఎక్కడికి పోడు.. గుజరాత్‌ టైటాన్స్‌తో పాటే ఉంటాడని వివరణ ఇచ్చింది. దీంతో ఆ జట్టు అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. కొందరు ఫ్యాన్స్‌ మాత్రం తమను ఫూల్స్‌ చేశారని జీటీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇలాంటి కన్‌ఫ్యూజింగ్‌ ట్వీట్లు చేయరాదని హితవు పలుకుతున్నారు. 

మరికొందరేమో నిప్పులేనిదే పొగ రాదని, ఏదో తేడా కొడుతుందని గుసగుసలాడుకుంటున్నారు. ట్రేడింగ్ ద్వారా శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందని, ఇంకొందరేమో గిల్‌ సీఎస్‌కేలోకి వెళ్తాడు, రవీంద్ర జడేజా గుజరాత్ టైటాన్స్‌లోకి వస్తాడని కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే శుభ్‌మన్‌ గిల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 132.33 స్ట్రైక్‌రేట్‌తో 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు