క్రికెట్‌ ప్రేమికులకు జియో శుభవార్త

20 Sep, 2020 14:30 IST|Sakshi

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ మజాను ఆస్వాధించే ప్రేక్షకులకు జియో నెట్‌వర్క్‌ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో పాటు నాన్‌ జియో యూజర్లు 'జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్' యాప్‌‌ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ను అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్‌ టీమ్‌కు స్టికర్‌ చాట్‌ ఏర్పాటు, స్కోర్‌లు, మ్యాచ్ షెడ్యూల్‌లు, ఫలితాలను యాక్సస్‌ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

‘డైలీ రివార్డ్స్’ ద్వారా పాల్గొనేవారు ప్రతిరోజూ బహుమతులు గెలుచుకోవచ్చు.. అంతేగాక ‘డైలీ ఛాలెంజెస్’ పూర్తి చేసిన తర్వాత బంపర్ బహుమతులు కూడా అందుకోవచ్చు. గేమ్‌ ప్రారంభమయ్యే ముందు రోజువారీ టాస్క్‌ల్లో భాగంగా గెలిచినవారికి అందించే బంపర్‌ ప్రైజ్‌ ఎంటనేది ముందే ప్రదర్శించడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో క్రికెట్ సీజన్‌ను ఎంజాయ్‌ చేస్తూ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'‌తో గెలుద్దాం! ఈ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్‌' గేమ్‌ను మై జియో యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మై జియో యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రికెట్‌ సీజన్‌లో జియో యూజర్లతో పాటు జియోయేతర యూజర్లు గేమ్‌ను ఆడి మంచి బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు