IND vs AUS: ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రవీంద్ర జడేజాకు భారీ షాకిచ్చిన ఐసీసీ

11 Feb, 2023 15:10 IST|Sakshi

India vs Australia, 1st Test - Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా జడేజా చేతికి క్రీమ్‌ రాసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐసీసీ.. అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రవర్తనా నియమావళిలోని నిబంధన 2.20ని జడేజా ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్‌ వేయడానికి వచ్చిన జడేజా ఎడమ చేతి చూపుడు వేలికి క్రీమ్‌ రాసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు జడేజా చీటింగ్‌ చేశాడని ఫోటోలు, వీడియోలతో సోషల్‌మీడియాలో ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ జడేజా వేలికి  రాసుకున్నది నొప్పిని తగ్గించే ఆయింట్‌మెంట్ అని సృష్టత ఇచ్చింది. 

అయితే, ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లకు చెప్పకుండానే, వారి అనుమతి తీసుకోకుండానే జడేజా ఆయింట్‌మెంట్‌ రాసుకోవడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జడ్డూకు జరిమానా విధించడంతో పాటు డిసిప్లినరీ పాయింట్లలో ఒక పాయింట్‌ కోత విధించింది. 

తొలి టెస్టులో ఆస్ట్రేలియా చిత్తు..
ఇక నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ విజయ భేరి మోగించింది. 223 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారత స్నిన్నర్ల దాటికి 91 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరచగా.. జడేజా రెండు, షమీ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక్క వికెట్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

చదవండి: IND vs AUS: అశ్విన్‌ అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా
Ind Vs Aus: పాపం.. అలా అయితే పాక్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేదేమో! తిక్క కుదిరిందా?


చదవండిIND vs AUS: ఏమైంది కోహ్లి? ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన విరాట్‌! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు