వరల్డ్‌కప్‌ భారత్‌లోనే కదా.. ఇక పూర్‌ ఓవర్‌రేట్‌ ఏంటి?

28 Nov, 2020 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 374 పరుగుల్ని సమర్పించుకుంది. ఆసీస్‌ భారీగా పరుగులు చేయడంతో ఊహించినట్లే స్లో ఓవర్‌రేట్‌ పడింది. భారత క్రికెట్‌ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది. 246 నిమిషాలు తీసుకుంది టీమిండియా. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక వన్డే మ్యాచ్‌లో పూర్తి బౌలింగ్‌ కోటా మూడు గంటల 30 నిమిషాల్లో కంప్లీట్‌ కావాలి. అంటే 210 నిమిషాల్లో మొత్తం ఓవర్లు వేయాలన్నమాట. ఇక్కడ టీమిండియా అదనంగా మరో 36 నిమిషాలు తీసుకోవడంతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. పూర్ ఓవర్ రేట్ కారణంగా టీమిండియా పాయింట్లను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఐసీసీ వన్డే లీగ్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టుకు ఓ పాయింట్‌ను జరిమానా విధిస్తారు. ఇలా జరిగే వరల్డ్ కప్ అర్హతపై కూడా ప్రభావం చూపుతుంది. (అది ఆసీస్‌ జట్టు..ఇలా అయితే ఎలా?: కోహ్లి అసహనం)

దీనిపై ఒక అభిమాని స్పందించాడు. 50 ఓవర్లు వేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది టీమిండియా. ఇది వచ్చే వరల్డ్‌కప్‌పై ప్రభావం చూపుతుంది’ అని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. పూర్ ఓవర్ రేట్ విషయమై భారత మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ ఫన్నీగా స్పందించాడు.  2023 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చే జట్టు టీమిండియానే కాబట్టి.. ఆ ఫరక్‌ అక్కర్లేదన్నాడు. ఇక్కడ పాయింట్లను కోల్పోయినా దాని ప్రభావం పడదన్నాడు. ఇదిలా ఉంచితే, ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఆతిథ్య జట్టు అనేది ఆటోమేటిక్‌గానే వరల్డ్‌కప్‌కు క్వాలిపై అవుతుంది.  అంటే ఆ మెగా ఈవెంట్‌కు ఇక్కడ పూర్‌  ఓవర్‌ రేట్‌ ప్రభావం చూపే అవకాశం లేదు. రూల్స్‌ ప్రకారం పాయింట్లు తగ్గినా వరల్డ్‌కప్‌ అర్హతపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది విషయాన్ని ట్వీటర్‌ యూజర్‌కు సుతిమెత్తగా చెప్పాడు జాఫర్‌. 

మరిన్ని వార్తలు