సిరీస్‌ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్‌ రద్దుపై ఆండర్సన్‌ భావోద్వేగం

12 Sep, 2021 20:13 IST|Sakshi

లండన్‌: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్‌ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ స్పందించాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్‌ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్‌ ఆఖరి మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. సిరీస్‌ డిసైడర్‌ అయిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్‌ గదులు బుక్‌ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని, మిస్‌ అయిన మ్యాచ్‌ రీషెడ్యూల్‌ అవ్వాలని అశిద్దామని భావేద్వేగపూరిత మెసేజ్‌ను పోస్ట్‌ చేశాడు. తన హెంగ్రౌండ్‌(ఓల్డ్‌ట్రాఫర్డ్‌)లో మరో మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని ఈ 39 ఏళ్ల లాంకషైర్‌ క్రికెటర్‌ పేర్కొన్నాడు. 

View this post on Instagram

A post shared by James Anderson (@jimmya9)


ఇదిలా ఉంటే, ఇదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. పాక్షికంగా రద్దైన ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్‌ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రా కాగా, రెండో మ్యాచ్‌ భారత్‌, మూడో టెస్ట్‌ ఇంగ్లండ్‌, నాలుగో మ్యాచ్‌ టీమిండియా గెలిచాయి. 4 మ్యాచ్‌ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్‌ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఓసారి 5 వికెట్ల ప్రదర్శన మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో 21 వికెట్లతో ఓలీ రాబిన్సన్‌ అగ్రస్థానంలో ఉండగా, 18 వికెట్లతో టీమిండియా పేసర్‌ బుమ్రా రెండో ప్లేస్‌లో నిలిచాడు.    
చదవండి: అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీస్‌ సమం అయినట్టే..

మరిన్ని వార్తలు