James Pattinson: బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి

9 Nov, 2021 18:25 IST|Sakshi

James Pattinson Throw Injures Opponent Batter.. ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ జేమ్స్‌ పాటిన్సన్‌ చర్యపై క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. షాఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో జేమ్స్‌ పాటిన్సన్‌ విక్టోరియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా టోర్నీలో భాగంగా విక్టోరియా, న్యూసౌత్‌ వేల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో న్యూ సౌత్‌వేల్స్‌ కెప్టెన్‌ డేనియల్‌ హ్యూజెస్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. 283 బంతులెదుర్కొన్న అతను 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్‌ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్‌!?

అయితే టీ విరామానికి ముందు డేనియల్‌ ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్‌ ఆడుతూ చికాకు పెట్టాడు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌కు వచ్చిన జేమ్స్‌ పాటిన్సన్‌కు హ్యూజెస్‌ ఆట చిరాకు తెప్పించింది. పాటిన్సన్‌ వేసిన బంతిని హ్యూజెస్‌ డిఫెన్స్‌ ఆడగా..పాటిన్సన్‌ చిర్రెత్తిపోయాడు. బంతిని అందుకొని హ్యూజెస్‌ క్రీజులోనే ఉన్నప్పటికీ కావాలనే అతన్ని టార్గెట్‌ చేస్తూ కోపంతో విసిరాడు. బంతి కాస్త వెళ్లి హ్యూజెస్‌ పాదానికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన అతను కాసేపు క్రీజులో నుంచి పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత పాటిన్సన్‌ క్షమాపణ చెప్పేందుకు వెళ్లగా.. హ్యూజెస్‌ కోపంగా చూశాడు. టీ విరామ సమయంలో పెవిలియన్‌ వెళ్తున్న సమయంలో పాటిన్సన్‌, హ్యూజెస్‌ మధ్య మాటలయుద్ధమే నడిచింది. కొద్దిసేపు అలాగే ఉండి ఉంటే కొట్టుకోవడానికి సిద్దమయ్యేవారే. మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పాటిన్సన్‌ చర్యపై సోషల్‌ మీడియాలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్‌ అంటే.. క్యాచ్‌ పట్టకపోయినా హీరో అయ్యాడు

''ఇలాంటి వ్యక్తిని ఇంకా క్రికెట్‌ ఆడనిస్తున్నారా.. వెంటనే బ్యాన్‌ చేయండి.. ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. అందుకే కోపంతో బంతిని విసిరాడు.. పాటిన్సన్‌ చర్య  దారుణం.. ఒక బ్యాటర్‌పై కోపం వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదు.. అందుకే ఆసీస్‌ టీమ్‌ అతన్ని పక్కకు పెట్టింది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు