IPL 2023: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! జట్టులోకి ప్రోటీస్‌ పేసర్‌

20 Mar, 2023 10:22 IST|Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ కైల్ జేమీసన్ గాయం కారణంగా  ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో జేమీసన్‌ను కోటి రూపాయల కనీస ధరకు సీఎస్‌కే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన జమీసన్ స్ధానంలో దక్షిణాఫ్రికా సిసంద మగలాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంపిక చేసింది.

                        

అతడిని రూ.50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే సొంతం చేసుకుంది. కాగా మగలాకు దేశవాళీ టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు 127 టీ20లు ఆడిన మగలా.. 136 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తొట్ట తొలి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరపున ఆడిన మగలా.. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు సాధించాడు.

                                                       

కాగా అతడు దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్‌ 16వ సీజన్‌ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి.
చదవండి: MS Dhoni: ‘రిటైర్మెంట్‌ సంగతి తెలీదు; ఫిట్‌గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడు’

మరిన్ని వార్తలు