జపాన్‌ ఫార్ములావన్‌ రద్దు

19 Aug, 2021 05:59 IST|Sakshi

టోక్యో: ఏడాది వాయిదా పడినా కూడా ఒలింపిక్స్‌ను అద్భుతంగా నిర్వహించిన దేశం జపాన్‌. పారాలింపిక్స్‌ కూడా ఈ నెల 24 నుంచి అక్కడే జరగనున్నాయి. అయితే వందల సంఖ్యలో దేశాలు, వేల సంఖ్యలో అథ్లెట్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరం పదుల సంఖ్యలో జరిగే ఫార్ములావన్‌ జపనీస్‌ గ్రాండ్‌ ప్రి ఈవెంట్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిం ది. కరోనా మహమ్మారి కారణంగా తమ దేశంలో జరగాల్సిన ఫార్ములావన్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. సుజుకా ట్రాక్‌పై అక్టోబర్‌ 10న జపాన్‌ గ్రాండ్‌ ప్రి జరగాల్సివుంది. ప్రభుత్వం, రేస్‌ ప్రమోటర్లు, ఫార్ములావన్‌ వర్గాలు దీనిపై చర్చించిన అనంతరం ఈ సీజన్‌ రేసు రద్దయింది.

మరిన్ని వార్తలు