సిడ్నీ టెస్ట్‌: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు

9 Jan, 2021 16:10 IST|Sakshi

సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్‌ సపోర్టర్స్‌ సిరాజ్‌, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదాస్పందంగా మారింది. మూడోరోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే టీమిండియా బౌలర్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్‌ అజింక్యా రహానే జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లైన అశ్విన్‌, రోహిత్‌ శర్మలతో కలిసి ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. కాగా బౌలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సిడ్నీ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది.(చదవండి: వాటే సెన్సేషనల్‌ రనౌట్‌..!)

కాగా సిరాజ్‌, బుమ్రాలపై డ్రింక్‌ సపోర్టర్స్‌ వ్యవహరించిన తీరును తప్పుబట్టిన టీమిండియా ఫిర్యాదుపై  ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.అంతేగాక వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ.. 2019 వరల్డ్‌ కప్‌ సాధించిన ఇంగ్లండ్‌ జట్టు గురించి ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ఇంగ్లండ్‌ జట్టు ప్రప‍ంచకప్‌ సాధించడంలో జోఫ్రా ఆర్చర్‌ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో ఆర్చర్‌ సూపర్‌ ఓవర్‌ను సూపర్‌గా వేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతను నల్ల జాతీయుడు.. కానీ ఏనాడు అతన్ని ఇంగ్లండ్‌ జట్టు వేరుగా చేసి చూడలేదు. క్రికెట్‌ అంటేనే జెంటిల్‌మెన్‌ గేమ్‌కు పెట్టింది పేరు. తుది జట్టులో 11 మంది ఉంటే.. వారు విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వైవిధ్యం లేకపోతే క్రికెట్‌ అనే పదానికి అర్థం లేదు. ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలతో ఆటగాళ్లను మానసికక్షోభకు గురి చేయడం కరెక్ట్‌ కాదు. అంటూ ట్వీట్‌ చేసింది.(చదవండి: ఆసీస్‌ క్రికెటర్‌పై షేన్‌ వార్న్‌ అసభ్యకర వ్యాఖ్యలు)

కాగా సిరాజ్‌, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు సిడ్నీఅభిమానులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ , టీమిండియా వెటెరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అంత తేలిగ్గా ఎవరు మరిచిపోలేరు. అప్పటి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ​ మంకీగేట్‌ వివాదంగా క్రికెట్‌ చరిత్రలో పెను సంచలనం రేపింది.

మరిన్ని వార్తలు