#Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ బాల్‌! బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌

3 Feb, 2024 14:09 IST|Sakshi

వరల్డ్‌క్రికెట్‌లో తానే యార్కర్ల కింగ్‌ అని టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 28 ఓవర్‌లో బుమ్రా ఐదో బంతిని అద్బుతమైన ఇన్‌స్వింగర్‌ యార్కర్‌గా సంధించాడు. పోప్‌ తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో పోప్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బాల్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు