T20 World Cup 2022: బుమ్రాకు తిరగబెట్టిన గాయం.. టి20 ప్రపంచకప్‌కు దూరం!

29 Sep, 2022 15:25 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్‌ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టి20కి బుమ్రాను రెస్ట్‌ పేరుతో పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి బుమ్రా జట్టుతో పాటు తిరువనంతపురంకు రాలేదని సమాచారం.

ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యాచ్‌ అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రాను బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బుమ్రా జట్టుతో పాటే వచ్చి ఉంటాడని అనుకున్నారు. కానీ బుమ్రాకు వెన్నునొప్పి గాయం తిరగబెట్టిందని.. అయితే సర్జరీ అవసరం లేకపోవచ్చు గానీ.. కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరం అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు తెలిసింది. కాగా బీసీసీఐ అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాతే బుమ్రా గాయంపై మరింత క్లారిటీ వస్తుంది.

చదవండి: Ind VS SA: ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఎందుకిలా? అతడికి రెస్ట్‌ అవసరమైతే!

పికిల్‌బాల్‌ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్‌!

మరిన్ని వార్తలు