సిక్స్‌తో బుమ్రా హాఫ్‌ సెంచరీ.. వీడియో వైరల్‌

11 Dec, 2020 13:54 IST|Sakshi

సిడ్నీ: మనం ఇప్పటివరకూ జస్‌ప్రీత్‌ బుమ్రాను టీమిండియా ప్రధాన పేసర్‌గానే చూశాం. కానీ మనోడు బ్యాట్స్‌మన్‌ అవతారం కూడా ఎత్తేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా-‘ఎ’తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బుమ్రా అర్థ శతకం నమోదు చేసి ఔరా అనిపించాడు. రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, మయాంక్‌ అగర్వాలు, సాహాలు విఫలమైన చోట బుమ్రా బ్యాట్‌కు పనిచెప్పాడు. జట్టును బౌలర్‌గానే కాకుండా బ్యాటింగ్‌తో కూడా గాడిలో పెడతాననే విషయం చెప్పకనే చెప్పేశాడు. తొలి రోజు ఆటలో భాగంగా భారత్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాలు ఆరంభించారు. (రోహిత్‌ శర్మకు లైన్‌ క్లియర్‌)

కాగా, మయాంక్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోగా, పృథ్వీ షౠ(40) రాణించాడు. అనంతరం శుబ్‌మన్‌ గిల్‌(43) కూడా మెరిశాడు. ఆపై వరుసగా ఆరుగురు ఆటగాళ్లు విఫలం కాగా, బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ఈ జోడి 71 పరుగులు జత చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.  ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. సదర్‌లాండ్‌ బౌలింగ్‌ సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ కావడం విశేషం.  బుమ్రా హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్‌(22) పదో వికెట్‌గా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.  బుమ్రా 57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.భారత్‌ జట్టు 48. 3 ఓవర్లలో  194 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌’ఎ’ బౌలర్లలో అబాట్‌, వైడ్‌మత్‌లు తలో మూడు వికెట్లు సాధించగా,  కాన్వే, సదర్లాండ్‌, గ్రీన్‌, స్వెప్సన్‌లకు వికెట్‌ చొప్పున లభించింది. బుమ్రా సాధించిన హాఫ్‌ సెంచరీ వీడియో వైరల్‌గా మారింది. ఆసీస్‌ గడ్డపై అర్థ శతకం సాధించావంటే నీలో బ్యాట్స్‌మన్‌ యాంగిల్‌ కూడా ఉందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు