T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్‌ షమీ? దీపక్‌ చాహర్‌?

9 Oct, 2022 11:02 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా రిప్లేస్‌మెంట్‌ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. ఇప్పటి వరకు ఇంకా  బుమ్రా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. ఆక టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆయా దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునేందుకు ఆదివారం(ఆక్టోబర్‌9) వరకు మాత్రమే అవకాశం ఉంది.

కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బుమ్రా స్థానం కోసం ముఖ్యంగా ఇద్దరు పేసర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకరు వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కాగా.. మరొకరు యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వీరిద్దరికి చోటు దక్క లేదు.

చాహర్‌, షమీకి స్టాండ్‌బై ఆటగాళ్లగా సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన షమీ.. కొవిడ్‌ బారిన పడడంతో దూరమయ్యాడు. ఇక దీపక్‌ చహర్‌ ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం దీపక్‌ అదరగొట్టాడు.

కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు దీపక్‌ చాహర్‌ కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే చాహర్‌ గాయం అంతతీవ్రమైనది కాదు అని బీసీసీఐ అదికారి ఒకరు పేర్కొన్నారు. ఇక షమీ, చాహర్‌ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నారు. వీరిద్దరూ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డారు. అయితే బుమ్రా స్థానంలో అనుభవం ఉన్న షమీనే ఎంపిక చేస్తారని క్రికెట్‌ విశ్లేషుకులు అభిప్రాయనపడుతున్నారు.
చదవండి: Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్‌ జరిగేనా?

>
మరిన్ని వార్తలు