Jasprit Bumrah: వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్‌ సూపర్‌

6 Mar, 2022 12:20 IST|Sakshi

టీమిండియా, శ్రీలంక మధ్య తొలి టెస్టులో లంక ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక బ్యాట్స్‌మన్‌ అసలంక ఔట్‌ విషయంలో బుమ్రా చూపించిన కాన్ఫిడెన్స్‌కు అభిమానులు సలాం కొడుతున్నారు. విషయంలోకి వెళితే..  ఇన్నింగ్స్‌ 58వ ఓవర్‌ ఆఖరి బంతిని బుమ్రా ఆఫ్‌ కట్టర్‌ వేశాడు. 124 కిమీ వేగంతో వచ్చిన బంతి అసలంక ప్యాడ్లను తాకింది. బుమ్రా అంపైర్‌ ఔట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు.

ఈ సమయంలో బుమ్రా మినహా ఏ టీమిండియా ఆటగాడు అప్పీల్‌ చేయకపోవడం విశేషం. అంపైర్‌ కూడా నాటౌట్‌ ఇచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్‌ను చూస్తూ డీఆర్‌ఎస్‌ అంటూ పేర్కొన్నాడు. కానీ రోహిత్‌ మాత్రం రివ్యూ అవసరమా అన్నట్లుగా చూశాడు. పంత్‌, కోహ్లిలు కూడా రివ్యూ విషయంలో రోహిత్‌తో ఏం చెప్పలేదు. దీంతో బుమ్రా అది కచ్చితంగా ఔటేనని కాన్ఫిడెన్స్‌తో ఉ‍న్నాడు.

టీమిండియా ఆటగాళ్లు ఎంత వారించినా బుమ్రా మాట వినకుండా రోహిత్‌ను రివ్యూకు వెళ్లాలంటూ కోరాడు. దీంతో తప్పని పరిస్థితిలో చివరి సెకన్‌లో రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు. ఇక అల్ట్రాఎడ్జ్‌లో పిచ్‌పై కరెక్ట్‌ దిశలో వెళ్తున్న బంతి  మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ అసలంక ఔట్‌ అని ప్రకటించాడు అంతే రోహిత్‌ ఒక్కసారిగా సూపర్‌ బుమ్రా అంటూ గట్టిగా అరుస్తూ అతనికి అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. జడ్డూ దెబ్బకు శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్‌ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. దీంతో లంక ఫాలోఆన్‌ ఆడడం అనివార్యమైంది. లంక బ్యాటింగ్‌లో నిస్సంకా 61 పరుగులు నాటౌట్‌తో చివరి వరకు నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్లలో అసలంక 29, కరుణరత్నే 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు, అశ్విన్‌ 2,బుమ్రా 2, షమీ ఒక వికెట్‌ తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా 175 పరుగులు నాటౌట్‌గా నిలవగా.. అశ్విన్‌ 61, విహారి 58, కోహ్లి 45 పరుగులు చేశారు.

బుమ్ర-రోహిత్‌ రివ్యూ వీడియో కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు