అతన్ని ఎదుర్కోవడం కష్టమే

29 Jan, 2021 16:11 IST|Sakshi
రోరీ బర్న్స్‌

బుమ్రా అసాధారణ సీమర్‌

ఈసారి పేస్‌ పిచ్‌లేమో! 

ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ 

చెన్నై: ఇటీవల టీమిండియా పేస్‌ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్‌ గడ్డపై ఈసారి తమకు సీమ్‌ పిచ్‌లు ఎదురవుతాయని ఆశిస్తున్నట్లు ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ అన్నాడు. సాధారణంగా భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లే ఉంటాయి. కానీ గత కొంత కాలంగా భారత సీమర్లు కూడా స్పిన్నర్లకు దీటుగా మ్యాచ్‌ల్ని భారత్‌ వైపు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ బర్న్స్‌ మీడియా సమావేశంలో పిచ్‌ల సంగతి ప్రస్తావించాడు.

శ్రీలంకపై 2–0తో గెలిచినప్పటికీ సొంతగడ్డపై భారత్‌తో పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. భారత శిబిరంలో జస్‌ప్రీత్‌ బుమ్రా అసాధారణ సీమర్‌ అని, అతన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నాడు. 30 ఏళ్ల బర్న్స్‌ శ్రీలంకతో జరిగిన సిరీస్‌ ఆడలేదు. మరోవైపు భారత క్రికెటర్లందరూ తమ తొలి కోవిడ్‌ పరీక్షలో నెగిటివ్‌గా తేలారని ప్రకటించిన బీసీసీఐ... క్వారంటైన్‌లో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఉండేందుకు అనుమతి కూడా ఇచ్చింది.     

ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌ అంపైర్లతో... 
భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఎలైట్‌ ప్యానెల్‌లో ఉన్న నితిన్‌ మీనన్‌తో పాటు తొలి టెస్టుకు అనిల్‌ చౌదరి, రెండో టెస్టుకు వీరేందర్‌ శర్మ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరిస్తారు. అనిల్, వీరేందర్‌లు ఈ సిరీస్‌ ద్వారా టెస్టు అంపైర్లుగా అరంగేట్రం చేయనున్నారు. నిజానికి వీరిద్దరు ప్రస్తుతం ఐసీసీ ఇంటర్నేషనల్‌ అంపైర్స్‌ ప్యానెల్‌లో మాత్రమే ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో తటస్థ అంపైర్లను నియమించడం కష్టంగా మారడంతో వివిధ సిరీస్‌ల సమయంలో స్థానిక అంపైర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. తొలి టెస్టుకు హైదరాబాద్‌కు చెందిన సి.శంషుద్దీన్‌ థర్డ్‌ అంపైర్‌గా పని చేస్తారు.  

చదవండి: 
అరంగేట్రంలోనే ‘5’ వికెట్లు పడగొట్టాడు!

బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?

Poll
Loading...
మరిన్ని వార్తలు